హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబాను దర్శించుకున్నారు. ఆదిలాబాద్‌కు విచ్చేసిన దత్తాత్రేయకు.. అధికారులు, భాజపా నేతలు ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో.. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానానికి చేరుకున్నారు దత్తాత్రేయ. ఎంపీ సోయం బాపురావు, జిల్లా కలెక్టర్ పట్నాయక్, ఎస్పీ విష్ణు వారియర్లతో పాటు.. భాజపా శ్రేణులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయానికి బయలుదేరి వెళ్లారు. ఆలయానికి చేరుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి: 'సేవాలాల్ మహరాజ్ హిందువులందరికీ ఆదర్శం'