కరోనా ప్రభావంతో ఆలయాల్లో భక్తుల సందడి లేక గురుపౌర్ణమి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ సాయిబాబా ఆలయానికి భక్తులు అంతంత మాత్రంగానే తరలివచ్చారు. వచ్చినవారు సైతం మాస్కు ధరించి శానిటైజ్ చేసుకుని దర్శనాలు చేసుకోవాలని ఆలయ నిర్వహకులు భక్తులకు సూచిస్తున్నారు.
ఆలయ అర్చకులే స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి విగ్రహాన్ని తాకకుండా దేవాలయ అధికారులు లఘుదర్శనాలు అనుమతించారు. తీర్థ ప్రసాద వితరణ లేకపోవడం వల్ల భక్తులు కేవలం బాబాని దర్శనం చేసుకుని వారివారి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇవీ చూడండి: కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం