ETV Bharat / state

అటవీ అధికారులను అడ్డుకున్న ఆదివాసీలు - forest

అక్రమ కలప నిలవ ఉందన్న సమాచారంతో వచ్చిన అటవీ శాఖ అధికారులను ఆదిలాబాద్​ జిల్లాలోని వాయుపేట గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇంటి అవసరానికి కలప తీసుకొచ్చామని అధికారులతో వాగ్వాదానికి దిగారు.  పోలీసులు సోదాకు ప్రయత్నిస్తే.. దాడికి యత్నించారు.

అటవీ అధికారులను అడ్డుకున్న ఆదివాసీలు
author img

By

Published : Apr 17, 2019, 11:45 AM IST

అటవీ అధికారులను అడ్డుకున్న ఆదివాసీలు

అటవీ సిబ్బంది తీరును నిరసిస్తూ ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం వాయుపేట గ్రామస్థులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. ఓ ఇంట్లో అక్రమంగా కలప నిల్వ ఉందన్న సమాచారం మేరకు అటవీశాఖ సిబ్బంది గ్రామానికి చేరుకోగా వారిని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇంటి అవసరానికి కలప తీసుకొస్తే పట్టుకునేందుకు వచ్చిన సిబ్బంది.. అక్రమ కలప రవాణాపై సమాచారం ఇచ్చినపుడు ఎందుకు రాలేదంటూ నిలదీశారు. ఈ సమయంలో సిబ్బందికి గ్రామస్థులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను సముదాయించే యత్నం చేశారు. చివరకు కలప ఉన్న ఇంటిలో సోదాలకు యత్నించగా... గ్రామస్థులు కారంపొడి, కొడవళ్లు, కట్టెలు పట్టుకుని వారిని నిలువరించే యత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. చివరకు చేసేదేమిలేక అటవీ శాఖ, పోలీసులు వెనుదిరగడంతో వివాదం సద్దుమణిగింది.

ఇవీ చూడండి: కాంగ్రెస్​ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కేసు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.