ETV Bharat / state

ఆ ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందని పౌష్టికాహారం..! - adilabad rims latest news

ఓ పక్క రాష్ట్రం అంతా కరోనాతో అల్లాడుతుంటే.. మరో వైపు కొంత మంది అధికారులు కరోనా బాధితులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఆదిలాబాద్​ రిమ్స్​లో చేరిన వైరస్​ వ్యాధిగ్రస్తులకు సరైన పౌష్టికాహారం అందించడం లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని అడిగితే తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​

food to the covid patients in adilabad
ఆ ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందని పౌష్టికాహారం..!
author img

By

Published : Jul 14, 2020, 9:24 AM IST

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు సరైన పౌష్టికాహారం అందించడంలో గుత్తేదారుల నిర్లక్ష్యం బయటపడింది. పోషక విలువలు లేని ఆహారం తమ పాలిట ప్రాణసంకటంగా మారుతోందని వైరస్​ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 14 మంది కొవిడ్​ బాధితులు రిమ్స్​ చికిత్స పొందుతున్నారు.

కాగా వీరందరికీ నిర్దేశిత మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సి ఉండగా గుత్తేదారు అదేమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఉదయం పూట ఇచ్చే ఇడ్లీలో పురుగులు రావడం, అందరికీ కలిపి రెండు నీటి బాటిళ్లు, ఒకే పార్సిల్ ఇచ్చి భోజనం చేయమని వదిలేసి వెళ్లడం చేస్తున్నారని వారు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్..​ స్మార్ట్​ఫోన్​ కానుక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.