ఆదిలాబాద్ జిల్లాలో తొలిరోజు ధరణి పోర్టల్ ద్వారా ఆస్తుల క్రయ, విక్రయాల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. నిర్ణీత సమయంలో తొమ్మిది రిజిస్ట్రేషన్లను అధికారులు పూర్తి చేశారు. ఒకరోజు ముందుగానే స్లాట్ బుక్ చేసుకున్నవారు తహసీల్దార్ కార్యాలయాలకు తరలివచ్చారు.
అరగంటలో క్రయ, విక్రయదారుల సంతకాలు, వేలిముద్రలు, ఫోటోల ప్రక్రియను ముగించారు. జిల్లాలో కొన్ని కార్యాలయాల వద్ద సందడి కనిపించగా మరికొన్ని వెలవెలబోయాయి. తొలిరోజు ఎలాంటి సమస్యలు లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తి కావడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు.