ఆదిలాబాద్ జిల్లాలో వాయిదాలు పడుతూ వచ్చిన పత్తి కొనుగోళ్లు ఇవాళ మొదలయ్యాయి. ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్, జడ్పీ ఛైర్మన్ ప్రారంభించిన గంటతర్వాత తూకంలో తేడా బయటపడడం వల్ల రైతులు ఆందోళనకు దిగారు. ఏకంగా 4క్వింటాళ్ల పత్తి తేడా రావడం వల్ల తూకం వేసే కాంటా వద్ద నిరసనకు దిగారు.
నెలరోజుల నుంచి కొనుగోళ్లు వాయిదాపడుతున్నప్పటికీ అధికారులు సరైన చర్యలు చేపట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. సాంకేతికంగా ఎలాంటి సమస్య తలెత్తకుండా మార్కెటింగ్‌శాఖ చర్యలు తీసుకోవడంలో విఫలమైందని తెలిపారు. తూనికలు, కొలతల అధికారులు అందుబాటులోకే రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూకంలో తేడా బయటపడడం వల్ల ఆగమేఘాలపై సరిచేసే ప్రయత్నం చేసినట్లు రైతులు చెబుతున్నారు.
మార్కెట్‌యార్డులో కాంటాల మరమ్మతులు, నిర్వహణకు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక నిధులు మంజూరుచేస్తున్నప్పటికీ... తూకంలో తేడారావడం అనుమానాలకు తావిస్తోంది.
ఇవీ చూడండి: 20 రోజుల్లో వ్యవసాయేతర ఆస్తులకు రిజిస్ట్రేషన్: కేసీఆర్