ETV Bharat / state

ఒకరి తర్వాత ఒకరు... అయిదు రోజుల్లో ముగ్గురు మృతి

కరోనా అందరి జీవితాలతో ఆటలాడుకుంటూ వారి ప్రాణాలు బలితీసుకుంటుంది. మాయదారి వైరస్ ఇంట్లో ఒకరికి సోకి... వారినుంచి కుటుంబం మొత్తానికి వ్యాపించి బలి తీసేసుకుంటుంది. బోథ్​లో అయిదు రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా... మరొకరు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.

family-collapsed-with-coronavirus-in-bodh-in-adilabad-district
ఒకరి తర్వాత ఒకరు... అయిదు రోజుల్లో ముగ్గురు మృతి
author img

By

Published : May 6, 2021, 8:00 AM IST

కరోనా ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలో కరోనా పంజాకు ఒకరి తర్వాత ఒకరు.. అయిదు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. బోథ్‌లో ఈ నెల 1న కుటుంబ పెద్ద మెరుగు నర్సయ్య(65) బలికాగా, ఆయన చిన్న కుమారుడు మెరుగు చిన్ననర్సయ్య(34) నిర్మల్‌లో చికిత్స పొందుతూ సోమవారం మరణించారు.

ఈ విషాదం నుంచి కోలుకోక ముందే నర్సయ్య భార్య మెరుగు లక్ష్మి(58) నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. చిన్ననర్సయ్య భార్య సైతం కరోనా బారిన పడి నిర్మల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి: పెంపుడు కుక్కలతో పశువైద్యశాలలకు జనాల పరుగులు.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.