ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గుంజాలలో హెల్పర్ రాజు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వీధి దీపాలు అమర్చే సమయంలో విద్యుత్ సరఫరా కావడం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడం వల్ల.. అక్కడికక్కడే కుప్పకూలడు.
స్థానికులు నిచ్చెన సహాయంతో రాజును కిందికి దించి ప్రాణాలు కాపాడారు. ఈప్రమాదంలో వీపు, చేతులకు గాయాలు కావడం వల్ల ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని రిమ్స్ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: మెట్రో టికెట్ ధరలపై హైకోర్టులో సీపీఎం పిటిషన్