ETV Bharat / state

Electricity Issues : అడవుల జిల్లాలో కరెంట్ కష్టాలు.. ఇబ్బందుల్లో ప్రజలు - power problems in Adilabad

ఉమ్మడి ఆదిలాబాద్‌ విద్యుత్‌శాఖ(Electricity Issues)లో అత్యంత కీలకమైన సబ్‌ స్టేషన్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతోంది. ప్రతి ఏటా వేసవి కాలంలో మరమ్మతుల పేరిట చేస్తున్న దందా.. గుత్తేదారులకు కాసుల వర్షం కురిపిస్తుంటే.. సంస్థకు ఆర్థిక భారమవుతోంది. నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ లిమిటెడ్‌ పరిధిలోకి వచ్చే ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో సబ్‌స్టేషన్ల నిర్వహణలో, స్తంభాల మధ్యదూరం పాటించడంలో శాస్త్రీయ ప్రమాణాలు పాటించకపోవడంతో తరుచూ సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న విద్యుత్‌శాఖ పనితీరుపై ప్రత్యేక కథనం...

electricity-issues-in-adilabad-district
అడవుల జిల్లాలో కరెంట్ కష్టాలు
author img

By

Published : Jul 12, 2021, 10:35 AM IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 132/33 కేవీ సబ్‌స్టేషన్లు 15 ఉంటే... 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 225 ఉన్నట్లు అధికారిక లెక్క. సబ్‌ స్టేషన్లంటే అత్యంత కీలకమైనవి. రామగుండంలాంటి ఉత్పత్తి కేంద్రాల నుంచి సరఫరా తొలుత 132/33 సబ్‌స్టేషన్లకు వస్తుంది. అక్కడి నుంచి ఫీడర్లకు, ఆ తరువాత 33/11 కేవీ సబ్‌స్టేషన్ల ద్వారా ట్రాన్స్‌ఫార్మార్ల ద్వారా ఇళ్లు, ఇతర వినియోగాలకు సరఫరా అవుతుంది. కీలకమైన 132/33 కేవీ సబ్‌స్టేషన్లకు విద్యుత్‌ సరఫరా చేసే తీగలను చేరేవేసే స్తంభాల మధ్య 50 నుంచి 60 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో స్తంభాల మధ్య 100 మీటర్లు, ఆపైన కూడా దూరం ఉండటం వల్ల చిన్నగాలికే తీగలు ఊగుతూ... స్తంభాలు వంగిపోయి ప్రమాదాలు(Electricity Issues) సంభవించడానికి ప్రధాన కారణమవుతోంది.

అడవుల జిల్లాలో కరెంట్ కష్టాలు

ప్రాణ నష్టం.. పంట నష్టం.. ఆస్తి నష్టం..

ఉమ్మడి జిల్లాలో అటవీప్రాంతం ఎక్కువగా ఉందనే సాకుతో స్తంభాల నిర్వహణలో శాస్త్రీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవడంలేదు. స్తంభాలు వేసే సమయంలో 4.5 అడుగుల నుంచి 5 అడుగుల లోతులో గుంత తవ్వాలనే ప్రామాణికమైన నిబంధనలు పాటించడంలేదు. నేల స్వభావాన్ని పట్టి అవసరమైతే సిమెంట్‌, కంకరతోనూ పటిష్ఠంగా ఉండేలా గుంతలను పూడ్చాలి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఏఈలు, ఏడీల సమక్షంలో పర్యవేక్షణలో జరగాల్సిన ఈ పనులను... గుత్తేదారుల విజ్ఞతకు వదిలేస్తుండడంతో స్వల్పకాలంలోనే స్తంభాలు వంగిపోవడం సర్వసాధారణంగా మారుతోంది. ఫలితంగా ప్రమాదాలు(Electricity Issues) జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో గడిచిన మూడేళ్లలో దాదాపుగా 200 మందికిపైగా విద్యుదాఘాతంతో మృతిచెందడం ఆయా కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. మరోవైపు తెగిన విద్యుత్‌ తీగలతో పంటనష్టం, ఆస్తినష్టం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

గాలి వచ్చినప్పుడు.. విద్యుత్ తీగలు పంటపై పడిపోయి నష్టాన్ని చేకూర్చాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే అసలు పట్టించుకోలేదు. దాదాపు రూ.10 లక్షలు నష్టం వచ్చింది. ఇంట్లో కూడా సరిగ్గా విద్యుత్ సరఫరా ఉండటం లేదు. సమస్య ఏంటంటే కనీసం అధికారులు స్పందించడం లేదు. ఇష్టం వచ్చిన తీరులో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్తంభాలు వంగిపోయి.. విద్యుత్ తీగలు నేలకు వేలాడుతున్నాయి. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

- స్థానిక రైతు

సమన్వయ లోపం..

ఉట్నూర్‌ ఏజెన్సీ ప్రాంతంలో విద్యుత్‌ శాఖ పనితీరు మరింత దారుణంగా ఉంది. అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో కీలకమైన జూనియర్‌ లైన్‌మెన్లు, సీనియర్‌ లైన్‌మెన్లు, లైన్‌మెన్లు, ఫోర్‌మెన్ల విధుల నిర్వహణ గాడి తప్పింది. దినసరి కూలీలతో పనులు చేయించే అనధికారిక విధి నిర్వహణ కొనసాగుతోంది. ఫలితంగా సరఫరాలోనూ తరచూ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

పారదర్శకత లోపం..

జిల్లా విద్యుత్‌శాఖ పరిధిలో 139 మంది గుత్తేదారుల పాత్ర కీలకంగా ఉంది. అధికారికంగా ఎవరెవరికి ఏ ప్రాతిపదికన పనులు కేటాయిస్తున్నారనేది అంతుబట్టని అంశంగా మారింది. అత్యవసరంగా చేపట్టే పనులు చేపట్టాల్సి వస్తే.. ఎస్‌ఈ రూ. 2లక్షలకు వరకు , డీఈ రూ. లక్ష వరకు నామినేట్‌ చేసే వెసులుబాటు ఉంది. ఆపైన వ్యయానికి.. తప్పకుండా టెండర్‌ నిర్వహించాలనేది సంస్థ నిబంధన. కానీ ఇందులో పారదర్శకత లోపించడంతోనే పనుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారవుతుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.