ETV Bharat / state

స్థానికంగానే చేపపిల్లల ఉత్పత్తి.. కాలం.. ఖర్చు.. రెండూ తక్కువే! - పైలట్​ ప్రాజెక్ట్​

చేపపిల్లల ఉత్పత్తికి అవసరమైన నీటి వనరులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉంటే.. స్థానికంగానే ఉత్పత్తి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పైలట్​ ప్రాజెక్టుగా ఆదిలాబాద్​ జిల్లాను ఎంపిక చేసింది. జిల్లాలో ఎకోహాచరీ మంజూరు చేసింది. దీంతో.. వెంటనే అధికారులు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. తద్వారా కాలం.. ఉత్పత్తి ఖర్చు రెండు గణనీయంగా తగ్గనున్నాయి.

Eco hatcheries Pilot Project Started in Adilabad District
స్థానికంగానే చేపపిల్లల ఉత్పత్తి.. కాలం.. ఖర్చు.. రెండూ తక్కువే!
author img

By

Published : Sep 7, 2020, 11:25 AM IST

ఆదిలాబాద్​ జిల్లాలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఎకోహాచరీని మంజూరు చేసింది. చేపపిల్లల ఉత్పత్తికి అవసరమైన నీటి వనరులు, ఇతర సౌకర్యాలు జిల్లాలో పుష్కలంగా ఉన్నందున పైలట్​ ప్రాజెక్ట్​గా ఈ పథకాన్ని జిల్లా నుంచే ప్రారంభించింది. ఇంతకు మునుపు ప్రభుత్వం టెండర్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి చేపపిల్లలు కొని జిల్లాలకు సరఫరా చేసేవారు. దీని ద్వారా అటు సమయం, ఇటు ధనం అధికంగా ఖర్చయ్యేది. ఈ సీజన్​లో14.5 లక్షల చేపపిల్లలను కొనుగోలు చేశారు. ఏటా వీటి కొనుగోలుకు రూ.70 నుంచి 80 లక్షల వరకు ఖర్చయ్యేది. అయితే.. ఇకపై ఈ ఖర్చు గణనీయంగా తగ్గనుంది.

ఇప్పటి వరకు ఏటా రెండు సైజుల చేపపిల్లలను చెరువుల్లో వదులుతున్నారు. ఇకపై వీటిని స్థానికంగానే ఉత్పత్తి చేసి చెరువులు, జలాశయాల్లో వదిలేందుకు నిర్ణయించారు. గతంలో చేప పిల్లలను కడెం జలాశయం నుంచి తీసుకొచ్చి సాత్నాల ఫిష్‌ఫాంలో వేసేవాళ్లు. ఈ ఏడాది జిల్లాకు ఏకో హాచరీ మంజూరు కావడంతో బ్రీడర్‌ నుంచి మొదలు చేపపిల్లలు, చేపలను కూడా ఇక్కడే పెంచాలని అధికారురలు లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.6 లక్షల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే చేప పిల్లల ఉత్పత్తితో సాత్నాల జలాశయంలో పెద్ద మొత్తంలో చేపల పెంపకాన్ని చేపట్టనున్నారు.

ఇలా పెంచుతారు..

సాత్నాల ప్రాజెక్టు సమీపంలో ఉన్న ఫిష్‌ఫాంలో నీటి వనరులు, ఇతర సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల ఈ ఏడాది కట్ల, రవ్వ, బంగారుతీగ తదితర రకాల చేపపిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. తొలుత బ్రీడర్‌ చేపలు తీసుకొచ్చి ఇంజెక్షన్లు ఇచ్చి గుడ్లు ఉత్పత్తి అయ్యేందుకు 12 గంటలు ట్యాంకుల్లో ఉంచుతారు. మరుసటి రోజు గుడ్లను హాచరీస్‌లో వదులుతారు. మూడు రోజుల్లో చిన్న చిన్న చేపపిల్లలు ఉత్పత్తి అవుతాయి. వాటిని తీసి తిరిగి పెద్ద ట్యాంకుల్లో వదులుతారు. వాటిలో 20 రోజుల పాటు పెంచితే 30-40 మి.మీ. సైజుకు పెరుగుతాయి. తర్వాత జలాశయాలు, చెరువుల్లో వదులుతారు. ఇది విజయవంతం అయితే జిల్లాలోని మరిన్ని ప్రాంతాల్లో ఎకో హాచరీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చేపపిల్లలను స్థానికంగా ఉత్పత్తి చేయడం వల్ల ఇటు ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంమే కాకుండా.. నాణ్యమైన చేప పిల్లలు అనుకున్న సమయానికి లభిస్తాయి.

చేపపిల్లలు స్థానికంగా ఉత్పత్తి అయితే ఖర్చు తగ్గుతుంది. సమయానికి, నాణ్యమైన చేపపిల్లలను వదిలే జలాశయాల్లో వదలవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో తొలిసారి ఎకోహాచరీ ద్వారా చేపపిల్లల ఉత్పత్తి జరుగుతుంది. ఈ విధానం సత్ఫాలితాలు ఇస్తే మరిన్ని హాచరీలు మంజూరు అయ్యే అవకాశం ఉంది. మత్స్య సంఘాలతో పాటు రైతులు చేపల పెంపకం పట్ల దృష్టి సారిస్తే, లబ్ధి పొందే వీలుంది. లాభాలు గడించవచ్చని మత్స్యశాఖ సహాయ సంచాలకులు వై విజయ్​ కుమార్​ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 45 మత్స్య సహకార సంఘాలు ఉండగా.. అందులో 2750 మంది మత్స్యకారులు సభ్యత్వం కలిగి ఉన్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 225 చెరువుల్లో 21 లక్షల చేపపిల్లలు పెంచాలని లక్ష్యం విధించుకున్నారు.

ఇదీ చదవండి: "నా సొరకాయలు పోయాయి సార్..!"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.