బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారు ఇంటి నుంచి బయటకు రావొద్దని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ మనోహర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పుట్లూరు మండలం దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కుమ్మరికుంటను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఖమ్మం, హైదరాబాద్ నుంచి వచ్చిన పలువురు వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారితో మాట్లాడారు.
ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆరోగ్యంలో ఏదైనా మార్పు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. కరోనా పట్ల వారికి అవగాహన కల్పించారు.