జూన్‌లో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసి ప్రజలను హరితహారంలో భాగస్వాములను చేస్తామని ఆదిలాబాద్ పుర ఛైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణ శివారులోని మావల హరిత వనంలో అదనపు పాలనాధికారి డేవిడ్తో కలసి మొక్కలు నాటారు.
ముఖ్యమంత్రి చెప్పినట్లు పర్యావరణ పరిరక్షణలో భాగంగా హరితహారంలో మొక్కలు విరివిగా నాటి వాటిని పరిరక్షించాలన్నారు. అలా పరిరక్షిస్తేనే... భవిష్యత్తు తరాలు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ ఆనందంగా జీవించగలరని తెలిపారు.