ఇవీ చూడండి: 'ఈసీ పరిశీలనలో నిజామాబాద్ ఎన్నిక'
ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్‌పై నిర్ణయం ఉపసంహరణ
ఆదిలాబాద్ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి నరేశ్ జాదవ్‌పై ఉన్న బహిష్కరణ నిర్ణయాన్ని పార్టీ ఉపసంహరించుకుంది. తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన నరేశ్ జాదవ్‌ను సోనియా గాంధీ సలహాదారు అహ్మద్‌పటేల్ రంగంలోకి దిగి బుజ్జగించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం జాదవ్‌కు పార్టీలో లైన్ క్లియర్ చేసింది.
నరేశ్ జాదవ్‌పై బహిష్కరణను ఎత్తివేసిన కాంగ్రెస్
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు డాక్టర్ జాదవ్ నరేశ్‌పై ఉన్న బహిష్కరణను కాంగ్రెస్ పార్టీ ఎత్తివేసింది. గతంలో పార్టీ నియమనిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందున ఆయనపై బహిష్కరణ వేటు పడింది. తాజాగా క్షేత్ర స్థాయి నివేదికలు తెప్పించుకోవటంతో పాటు... పార్టీ నుంచి కూడా వచ్చిన పలు విజ్ఞప్తులతో ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి వివరించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు. లోక్‌సభ స్థానానికి తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన నరేశ్... అహ్మద్ పటేల్ సూచనతో ఉపసంహరించుకున్నారు.
ఇవీ చూడండి: 'ఈసీ పరిశీలనలో నిజామాబాద్ ఎన్నిక'