భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అణఁగారిన వర్గాలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు. తొలుత పట్టణంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టరేట్కు చేరుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా శిబిరంలో నినాదాలు చేశారు. చేతిలో రాజ్యాంగ పుస్తకాలను పట్టుకొని నిరసన తెలిపారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ