ETV Bharat / state

Crop Damage in Adilabad : పంట నష్టాలతో రైతుల కన్నీరు... పర్యటనలు.. పరామర్శలు తప్ప పరిహారం లేదంటూ ఆవేదన

Crop Damage in Adilabad : వరద ప్రభావం తగ్గినా కొద్దీ... ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రైతులకు జరిగిన పంటల నష్టం బయటపడుతోంది. మూడేళ్లుగా ప్రకృతి ప్రకోపానికి తలెత్తుతున్న ఉపద్రవం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తోంది. పర్యటనలు, పరామర్శలతో నాయకులు సరిపెడుతున్నారే తప్పా... పరిహారం ఇచ్చిందేమిటనే ఆందోళన అన్నదాతలను వెంటాడుతోంది. పచ్చని పైరులతో అలరారాల్సిన పంటచేలు కళ్లెదుటనే... బీడుభూమిగా మారడం కకావికలం చేస్తోంది.

Crop Damage in Adilabad
Crop Damage in Adilabad
author img

By

Published : Aug 5, 2023, 12:17 PM IST

Crop Damage in Adilabad పంట నష్టాలతో రైతు కంట కన్నీరు

Crop Damage in Adilabad Due to Floods : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఖరీఫ్‌ ఆరంభమే కష్టాలతో మొదలైంది. ఇది చాలదన్నట్లుగా తాజాగా వచ్చిన వరదల తాకిడికి పత్తి, సోయా పంటలకు అపారనష్టం జరిగింది. అసలే వర్షాధారంగా నడిచే సాగును అదే వాన కోలుకోలేని దెబ్బతీసింది. ఆదిలాబాద్‌, కుమురంభీం, నిర్మల్‌ జిల్లాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంట నీటిమునిగింది. నష్టం ఎంత అనేది ఇప్పటికిప్పుడే తెలిసే అవకాశం లేనప్పటికీ... కోతకు గురైన పొలాల్లో మరో పంట వేసే పరిస్థితి కనిపించడం లేదు. నదీ పరివాహాక ప్రాంతాల్లోని పంటచేలల్లో ఇసుక మేటలు పెట్టడం, బండరాళ్లు దర్శనమివ్వడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

Adilabad Floods 2023 : ఖరీఫ్‌ సీజన్‌ జూన్‌ మాసంలో ప్రారంభం కావాల్సి ఉండగా సకాలంలో వర్షాలు రాక... జులై మొదటివారంలో ప్రారంభమైంది. అడపా దడపా వానలతో అప్పటికే విత్తనాలు వేసిన రైతులు జులై 25 తర్వాత వచ్చిన వరదల కారణంగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రధానంగా కడెం, స్వర్ణ, గడ్డెన్నవాగు, సాత్నాల, మత్తడివాగు, ఆడ జలాశయాల వరదతోపాటు పెన్‌గంగ, ప్రాణహిత, పెద్దవాగు నదీపరివాహక ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. ప్రాజెక్టుల నిర్వహణ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవటంతో పంటలు కోల్పోవాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

Korutla Flood Problems 2023 : వరద గుప్పిట్లో కోరుట్ల.. దిక్కు తోచని స్థితిలో ప్రజలు

'' వర్షాలు రాకున్నా బాధే, వర్షాలు వచ్చినా వరదలతో ఇంకా పెద్ద బాధ. ఈసారి వచ్చిన వరద భారీ నష్టం కలిగించింది. నిండుకుండలా మారిందని.. ప్రాజెక్టుల్లోని గేట్లు అన్ని ఒక్క సారిగా తెరిచారు. ఆ వరదల ధాటికి పంటలు అన్ని కొట్టుకుపోయాయి. ప్రాజెక్టుల నిర్వహణ, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవటంతో పంటలు కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై ప్రభుత్వం మాకు తగిన పరిహారాన్ని చెల్లించాలని కోరుతున్నాం.'' - రైతులు

భారీ వర్షాలు, వరదల ధాటికి ఎకరాకు కనీసం 10వేల రూపాయల నుంచి 20వేల వరకు నష్టం జరిగిందనే ఆవేదన రైతుల్లో గూడుకట్టుకుంది. తాత్కాలికంగా అధైర్యపడొద్దని ఊరడించిన అధికార యంత్రాంగం ఆ తర్వాత పట్టించుకోవట్లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే పంటపొలాలతో పాటు.. రహాదారులు, ఇళ్లకు జరిగిన నష్టం తెలిసే అవకాశం ఉంది. కానీ... కార్యాలయాల్లో కూర్చొని నివేదికలు తయారుచేస్తే లాభమేముంటుందనే రైతుల ప్రశ్నలకు సమాధానం కరవవుతోంది. ఏటా ప్రజాప్రతినిధులు రావడం, ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని అధికారులు చెప్పడం పరిపాటిగా మారిందే తప్పితే.... ఇప్పటివరకు నయాపైసా పరిహారం వచ్చింది లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది

'' అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప ఎలాంటి పరిహారం ఇవ్వట్లేదు. ప్రాజెక్ట్ గేట్లు ఒకే సారి ఎత్తడం వల్ల వరదలకు మక్క, పత్తి, వరి పంటలు కొట్టుకుపోయాయి. అప్పులు తెచ్చి పంటలు వేస్తే వరదల కారణంగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాము.'' - రైతులు

TS Legislative Council Sessions 2023 : శాసనమండలిలో వర్షాలు, వరదలపై వాడీవేడిగా చర్చ

Flood Effect on Khammam District : శాంతించిన మున్నేరు.. ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.