ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని నాసిరకంగా నిర్మిస్తున్న గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో పూర్తి చేసిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని కోరారు.
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలపై అధికారుల పర్యవేక్షణ లోపించిందని సీపీఎం జిల్లా నాయకులు లంకా రాఘవులు ఆరోపించారు. తెరాస రెండో సారి అధికారంలోకి వచ్చినా.. లబ్ధిదారులకు ఒక్క ఇల్లు కూడా అందజేయకపోవడం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తెలుస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని రాఘవులు కోరారు.