ఆదిలాబాద్ రిమ్స్‌లో ఇకనుంచి కరోనా పరీక్షలు జరుగనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండగా... ఇక నుంచి ఆదిలాబాద్‌లోనూ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో కొవిడ్-19 పరీక్షల కోసం అధికారులు నెల రోజులు నుంచి కసరత్తు చేసి ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దవాఖానాలో టీబీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన సిబినాట్ ల్యాబ్‌లో కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ విభాగాన్ని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ ఛైర్మన్ రాఠోడ్ జనార్దన్ పరిశీలించారు. రిమ్స్‌లో 70 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం కలిగి ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆదిలాబాద్‌తో పాటు నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా వాసులకు కరోనా పరీక్షలు ఇక్కడ చేస్తామని వివరించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 40 కరోనా కేసులు నమోదు