ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 7645 మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఇందులో ఒక్క ఆదిలాబాద్ పట్టణంలోనే నాలుగు వేల ఆటోలు ఉంటాయి. అందులో సొంత వాహనాలున్నవారు రెండువేల మంది అయితే అద్దెకు నడుపుతున్న వారు మరో రెండు వేల మంది ఉంటారు. మిగతా వారు గ్రామాల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేయడానికి చేయడానికి ఉపాధి హామీ పనులు, వ్యవసాయ పనులు ఉన్నాయి.
పట్టణాల్లో అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది. చేసేందుకు పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని ఆటోలు కొనుక్కుని బతుకు సాగిస్తున్నారు. వాహనాలు నడవక, ఆదాయం లేక బతికేదెలా అనే ఆందోళన ఆటో చోదకులను వేధిస్తోంది.
![](https://assets.eenadu.net/article_img/03ADB8021.jpg)
ప్రభుత్వమే ఆదుకోవాలి
ఆటో నడపడం వల్ల వచ్చిన ఆదాయంతో బతుకు వెళ్లదీస్తున్నాం. లాక్‌డౌన్‌తో ఆటోడ్రైవర్లకు కుటుంబ పోషణ భారమైంది. ముఖ్యంగా పట్టణాల్లో అసలే ఆటోలు రోడ్డెక్కడం లేదు. ఈ పరిస్థితి ఎప్పటివరకు ఉంటుందో తెలియదు.
- షేక్ నయీం, ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
ఉపాధి పనులకు వెళ్తున్నా...
గత 40 రోజులుగా ఆటో ఇంటికే పరిమితమైంది. ఇల్లు గడవడం కష్టంగా మారింది. బతుకు తెరువు కోసం ఉపాధి పనులకు వెళ్తున్నా. నాతో పాటు మరో నలుగురు చోదకులది అదే పరిస్థితి. మా బాధలను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి.
- జి.అఖిలేష్, ఆటోడ్రైవర్ తలమడుగు
- జిల్లాలో ఆటోలు: 7645
- ఆదిలాబాద్ పట్టణంలో: 4000
- సొంత ఆటోలు ఉన్నవారు: 2000