ETV Bharat / state

ఆదిలాబాద్​లో కరోనా విజృంభణ.. 200 దాటిన యాక్టివ్​ కేసులు - ఆదిలాబాద్​లో కరోనా అప్​డేట్స్​ తాజా వార్త

ఆదిలాబాద్​ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం 31 మందికి పాజిటివ్‌ రావడం వల్ల.. ఇప్పటి వరకూ యాక్టివ్‌ కేసుల సంఖ్య 200 దాటింది. బాధితుల్లో ఎనిమిది నెలల చిన్నారి ఉన్నట్టు వైద్య విభాగం అధికారులు వెల్లడించారు.

corona cases updates in adilabad district
ఆదిలాబాద్​లో కరోనా విజృంభణ.. 200 దాటిన యాక్టివ్​ కేసులు
author img

By

Published : Aug 1, 2020, 12:42 PM IST

ఆదిలాబాద్​ జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ విజృంభన కొనసాగుతోంది. శుక్రవారం నాటికి జిల్లాలో కరోనా పాజిటివ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 200 దాటింది. తాజాగా 31 మందికి కొవిడ్‌ నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 206కు చేరింది. 31 మందిలో 10 మంది మహిళలు ఉన్నారు. ఇందులో ఎనిమిది నెలల చిన్నారి సైతం ఉంది. జిల్లాలో ఇప్పటి వరకు 297 మంది కరోనా బారినపడగా 87 మంది (శుక్రవారం ఆరుగురు) కోలుకొని డిశ్ఛార్జి అయ్యారు. శుక్రవారం 222 మంది అనుమానితుల నుంచి నమూనాలు సేకరించారు. నివేదికలు రావాల్సిన నమూనాలు 43 ఉన్నాయి. ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు ఉట్నూర్‌, నేరడిగొండ, ఇచ్చోడ, బోథ్‌ మండలాల్లో కరోనా క్రమంగా వ్యాపిస్తోంది.

ప్రాంతాల వారీగా..

ఉట్నూర్‌ మండలం శంకర్‌నాయక్‌తండా, ఆదిలాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌, ఫిల్టర్‌బెడ్‌, మహాలక్ష్మీవాడ(మహిళ), కొత్తహౌసింగ్‌బోర్డు, నేరడిగొండ(మహిళ), సుభాష్‌నగర్‌, టీచర్స్‌కాలనీ, విద్యానగర్‌(మహిళ), బోథ్‌లోని హనుమాన్‌గల్లీ, ఇచ్చోడ(మహిళ) ఒక్కొక్కరు చొప్పున కరోనా కాటు బలయ్యారు. భుక్తాపూర్‌లో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ధోబీ కాలనీలో ఇద్దరు మహిళలు(ఇందులో ఎనిమిది నెల చిన్నారి), ద్వారకానగర్‌లో ఇద్దరు, కైలాస్‌నగర్‌ ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళ, రాంనగర్‌ ఇద్దరు, రిమ్స్‌ క్వార్టర్లు ఇద్దరు, రవీంద్రనగర్‌లో ఒక వ్యక్తి, మరో మహిళ, శాంతినగర్‌ ఇద్దరు చొప్పున కొవిడ్‌ బారిన పడ్డట్లు డీఎంహెచ్‌ఓ రాఠోడ్‌ నరేందర్‌ ప్రకటించారు.

నేరడిగొండలో మరొకరికి..

నేరడిగొండ మండల కేంద్రానికి చెందిన మరొకరికి కరోనా సోకినట్లు వైద్యాధికారి ఆనంద్‌ కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఆయన సూచించారు.

బేలలో కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు ప్రారంభం

బేలతో పాటు సైద్‌పూర్‌ ప్రాథమిక కేంద్రాల్లో కరోనా ర్యాపిడ్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయని వైద్యులు క్రాంతికుమార్‌ తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను ప్రభుత్వం సరఫరా చేసిందన్నారు. అనుమానిత లక్షణాలతో బాధపడే వారు పీహెచ్‌సీలకు వచ్చి, పరీక్షలు చేసుకోవాలని ఆయన సూచించారు. పరీక్షల అనంతరం అర గంటలోపు ఫలితాలు ప్రకటిస్తామన్నారు.

భీంపూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

మండల కేంద్రమైన భీంపూర్‌లో శనివారం నుంచి స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించనున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో గ్రామస్థులు తీర్మానించారు. నిత్యవసర సరకులకు సంబంధించిన దుకాణాలను కేవలం మూడు గంటలు మాత్రమే తెరవాలని నిర్ణయించినట్లు సర్పంచి లింబాజీ తెలిపారు. 15 రోజులు లాక్‌డౌన్‌ పాటిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని ఎంపీడీవో, తహసీల్దారు, ఎస్సైలకు ముందస్తు సమాచారంగా తెలుపుతూ తీర్మాన ప్రతులను వారికి అందజేశారు. ఉప సర్పంచి రవీందర్‌, వీడీసీ సభ్యులు పురుషోత్తం, పాండురంగ్‌, ఉపేందర్‌, మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి గుడిహత్నూర్‌లో..

గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి 5 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు సర్పంచి జాదవ్‌ సునీత తెలిపారు. శుక్రవారం గుడిహత్నూర్‌ గ్రామ పంచాయతీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మాస్కులు ధరించని వారికి రూ.200 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు పతంగే బ్రహ్మానంద్‌, ఎంపీపీ రాఠోడ్‌ పుండలిక్‌, ఎంపీటీసీ సభ్యులు సవిత పాల్గొన్నారు.

జిల్లాలో కరోనా పరిస్థితి

● సేకరించిన నమూనాలు 2,356

● పాజిటివ్‌ కేసులు 297

● నెగెటివ్‌ నివేదికలు 2,016

● కరోనా యాక్టివ్‌ కేసులు 206

● కోలుకున్న వారు 87

● కరోనా మృతులు 04

ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.