మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ... ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో రైతులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మొక్కజొన్న నిల్వలు పెరిగిపోయాయని... నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. కనుకుట్ట గ్రామం నుంచి బోథ్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
తమ ప్రాంతంలో రెండోపంటగా మొక్కజొన్న తప్పితే మరోపంట పండదని రైతులు పేర్కొన్నారు. పత్తి, సోయా పంటల్లో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని విధాలుగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బోథ్ తహసీల్దార్ శివరాజ్‌కు రైతులు వినతిపత్రం సమర్పించారు.