కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను నిరసిస్తూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట పట్టింది. మాజీ ఎంపీ రమేశ్ రాఠోడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు నేతలు, కార్యకర్తలు యత్నించడం వల్ల కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. సంయుక్త కలెక్టర్ సంధ్యారాణి వచ్చి వినతి పత్రం స్వీకరించి, నేతలకు నచ్చచెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రమేశ్ రాఠోడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: ఆర్టీసీ ఛలో ట్యాంక్‌బండ్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు