జొన్నల కొనుగోళ్లు చేయాలనే డిమాండ్‌తో నిరసనకు చేసేందుకు వెళ్లాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతను ఆదిలాబాద్ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కిసాన్ సెల్ ఛైర్మన్ గంగాధర్‌ను కూడా నిర్బంధించారు.
విద్యానగర్ కాలనీలో ఉన్న నాయకులను బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా నేతలు అక్కడే బైఠాయించారు. జొన్నల కొనుగోళ్లను చేపట్టాల్సిన ప్రభుత్వం... బాధ్యతలను విస్మరించి రైతులను అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జొన్నల కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా