కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ నేతలు ఆందోళన చేపట్టారు. కొవిడ్ కష్టకాలంలో ప్రతి పేద కుటుంబానికి రూ. 7500 నగదుతో పాటు 10 కేజీల ఆహార ధాన్యాలు ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక ఫీజుల వసూళ్లను నియంత్రించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ కోరారు. మహమ్మారి బారి నుంచి ప్రజలను రక్షించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: టీకా తీసుకున్న వారిలో అయస్కాంత శక్తి- నిజమెంత?