ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఇటీవల విధుల్లో చేరిన తహసీల్దార్లతో కలెక్టర్ దివ్యా దేవరాజన్ సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ హత్య దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా విధులు నిర్వహించాలని దిశానిర్ధేశం చేశారు. భూప్రక్షాళన కార్యక్రమంలో పార్ట్-బి కేసుల వివరాలపై పూర్తి పట్టు సాధించాలని సూచించారు. కేసుల పరిష్కారంపై జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి తహసీల్దార్లకు అవగాహన కల్పించారు. సమావేశంలో సబ్కలెక్టర్ గోపి, తహసీల్దార్లు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై స్టే పొడిగింపు