అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ నిర్మల్ జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా చేపట్టింది. గత అక్టోబర్ నెలలో పెంచిన వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేది ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వేతనాలను చెల్లించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను, టీఏడీఏలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. 14, 19 జీవోలను రద్దు చేయాలన్నారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరారు. లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: కేసీఆర్ సొంత గ్రామానికి రూ.10కోట్ల ప్రత్యేక నిధులు