ETV Bharat / state

BRS MLA Ticket Issue In Adilabad District : కారులో కుదుపులు.. ఇంతకీ వారి పయనం ఎటువైపో..! - ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ల సమస్య

BRS MLA Ticket Issue In Adilabad District : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా భారత్​ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) రాజకీయమంతా బోథ్, ఖానాపూర్‌ నియోజకవర్గాల చుట్టే పరిభ్రమిస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలైన రాఠోడ్‌ బాపూరావు, రేఖా నాయక్‌ టికెట్లు చేజారడం, చివరి నిమిషం వరకు బోథ్‌ టికెట్టును ఆశించిన మాజీ ఎంపీ గోడం నగేశ్​ని అధిష్ఠానం పరిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా ఏం చేయాలనేదానిపై ముగ్గురు నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. పార్టీలో ఉండాలా? లేక ఇతర పార్టీలో చేరాలా? అనేదానిపై తర్జనభర్జన కొనసాగుతోంది.

Telangana BRS MLA Tickets 2023
BRS MLA Ticket Issue In Adilabad District
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2023, 1:11 PM IST

BRS MLA Ticket Issue In Adilabad District : ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్​కు బీఆర్ఎస్ జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆమె భర్త శ్యామ్ నాయక్‌ కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా ఆసిఫాబాద్‌ టికెట్​ కోసం దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక ఇప్పటికిప్పుడే కాకపోయిన.. భర్త బాటలోనే రేఖా నాయక్‌(Khanapur BRS MLA Rekha Naik) కూడా ఎన్నికలకంటే ముందు కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. బుధవారం రోజున ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖానాపూర్ నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకోవడంతో పార్టీ మార్పు ఖాయమనే మాట వినిపిస్తోంది. తీవ్ర నైరాశ్యానికి లోనైన రాఠోడ్‌ బాపూరావు, రేఖా నాయక్‌ను అనుచరులు, అభిమానులు ఓదార్చుతున్నప్పటికీ.. పార్టీ వీడితే వారితో నడిచేందుకు ద్వితీయశ్రేణి నాయకులైన జడ్పీటీసీ, మండల అధ్యక్షులెవరూ ముందుకు రావడం లేదు.

Telangana BRS MLA Tickets 2023 : ఆదిలాబాద్‌ జిల్లా తాంసీ జడ్పీటీసీ సభ్యుడు తాటిపెల్లి రాజు మాత్రం హైదరాబాద్‌లో ఉన్న మాజీ ఎంపీ గోడం నగేశ్​ని కలిసి సంఘీభావం తెలిపారు. అవసరమైతే ఏదో ఒకపార్టీలో చేరడానికి సాహసం చేయాలని సూచించారు. బోథ్‌ టికెట్​ దక్కించుకున్న నేరడిగొండ జడ్పీటీసీ సభ్యుడు అనిల్‌ జాదవ్, టికెట్ చేజారిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావు వేర్వేరుగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.

MLA Rekha Naik Congress Ticket : కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న MLA రేఖా నాయక్

శాసనసభ ఎన్నికల వరకు రేఖా నాయక్, బాపూరావు పదవీకాలం ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ గోడం నగేశ్​ని బీఆర్ఎస్​లో పార్టీ ఎంపీగానే స్థానం ఉంది. టికెట్లు చేజారడంతో ఈ ముగ్గురిలో ఇప్పటికిప్పుడే పార్టీ మారడం కంటే ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన సాగుతోంది. ఒకవేళ పార్టీ మారితే కాంగ్రెస్‌లో చేరాలా? బీజేపీలో చేరాలా? అనే తర్జనభర్జన కొనసాగుతోంది.

MLA Rekha Naik Applies For Congress Ticket : శ్యామ్ నాయక్‌ కాంగ్రెస్‌లో చేరడంతో రేఖా నాయక్‌ చేరిక దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోంది. శ్యామ్​ నాయక్‌ ఆసిఫాబాద్‌ స్థానం నుంచి పోటీచేస్తే రేఖా నాయక్‌ ఆదిలాబాద్‌ ఎంపీ బరిలో నిలవాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలిసింది. గోడం నగేశ్​, రాఠోడ్‌ బాపూరావు వర్గీయులను రాజకీయంగా తర్జనభర్జనకు గురిచేస్తోంది. బీఆర్​ఎస్​లోని కొంతమంది కీలక నేతలు కావాలనే సర్వే నివేదికలను తారుమారు చేయడంతోనే తమకు టికెట్(BRS MLA Ticket 2023) చేజారిందనే ఆవేదన బోథ్‌ ఎమ్మెల్యే బాపూరావు వర్గీయులు బాహాటంగానే పేర్కొనడం కలకలం సృష్టిస్తోంది. బాపూరావు మాత్రం పార్టీలోనే కొనసాగుతానని ప్రకటిస్తున్నప్పటికీ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశమవుతోంది.

ఇంతకీ పయనం ఎటో! : టికెట్ చేజారిన నేతలు బీఎస్పీ తరఫున పోటీ చేసేందుకు చాపకిందనీటిలాగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో కావాలనే తమను తప్పించారనే ఆలోచనకు వచ్చిన రాఠోడ్‌ బాపురావు, రేఖా నాయక్, గోడం నగేశ్​ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అవకాశం వస్తే బీజేపీ, కాంగ్రెస్‌ లేదంటే బీఎస్పీ తరఫున పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.

BRS MLA Rekhanayak Join Congress Today : నేడు కాంగ్రెస్‌ గూటికి ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్

Thummala BRS MLA Ticket Issue : కారు దిగుతారా.. కాంగ్రెస్​కు వెళ్తారా.. తుమ్మల దారి ఎటువైపు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.