ఆదిలాబాద్ పట్టణంలో ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగారక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లాలో చాలామంది రక్తహీనతతో బాధపడుతున్నందున అత్యవసర సమయంలో వారికి రక్తం కావాల్సి వస్తోంది. ఈ విషయాన్ని గ్రహించిన సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య యువకులతో కలిసి రక్తదానం చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా సొసైటీ ఆధ్వర్యంలో యువకులంతా ఒకచోట చేరి ఆదివారం రక్తదానం చేసి తమ బాధ్యతను నిర్వర్తించారు. అత్యవసర సమయంలో రక్తం ఎవరికీ అవసరమైన తాము ముందుంటామని సభ్యులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఆస్తుల నమోదు శరవేగంగా జరగాలి: కలెక్టర్