ఎల్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఉప తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. పేద, మధ్యతరగతి ప్రజలనుంచి ఎల్‌ఆర్‌ఎస్ పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బీజేవైఎం జాతీయ నాయకుడు శ్రీరామ్ నాయక్ ఆరోపించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధి లేక ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉపసంహరించుకోవాలని సూచించారు. తెరాస కార్యకర్తలు అక్రమంగా కబ్జా చేసిన వాటిని సక్రమంగా చేసుకునేందుకే ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకొచ్చారని విమర్శించారు.
ఇదీ చదవండి : 'పన్నుల వసూళ్లలో సీఎం కేసీఆర్ నిజాంను మించిపోయారు'