భాజపా తలపెట్టిన రాష్ట్ర బంద్ ఆదిలాబాద్ జిల్లాలో పాక్షికంగా కొనసాగుతోంది. ఉదయం పూట అక్కడక్కడ దుకాణాలను కొంతవరకు మూసి ఉంచినప్పటికీ... తరువాత తెరిచారు. ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా... భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ సహా ఇతర నేతలను గృహనిర్బంధం చేశారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలు... తొలివిడతగా జరగనున్న ప్రాదేశిక ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: నేటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు