ETV Bharat / state

పక్షులను ప్రేమిస్తే.. అవి జీవితాన్ని పదిలం చేశాయి! - ఆదిలాబాద్​ జిల్లా లేటెస్ట్​ వార్తలు

సోనూ.. మున్నా.. చింటూ... సాధారణంగా ఇళ్లల్లో ముద్దుగా పిల్లలకు పెట్టుకునే పేర్లివి. అలాంటి పేర్లతోనే పక్షులను మచ్చిక చేసుకుంటున్నారు ఇద్దరు సోదరులు. వాటికి శిక్షణనిస్తున్నారు. అదే జీవన విధానంగా కొనసాగిస్తున్న ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన పక్షి ప్రేమికులపై కథనం.

bird lovers at echoda in adialabad district
పక్షులపై ఉన్న ప్రేమ ఆ సోదరులకు జీవనోపాధి అయింది
author img

By

Published : Jan 23, 2021, 2:37 PM IST

పక్షులపై ఉన్న ప్రేమ ఆ సోదరులకు జీవనోపాధి అయింది

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడకు చెందిన అన్నదమ్ములు షేక్‌ అన్వర్‌, షేక్‌ ఫెరోజ్‌కు బాల్యం నుంచే పక్షులంటే అమితమైన ఆసక్తి. అదే ఆసక్తి వారిని పక్షి ప్రేమికులుగా మార్చింది. ఇచ్చోడలోనే ప్రత్యేకంగా ఓ గదిని అద్దెకు తీసుకొనేలా చేసింది. ప్రస్తుతం వారు పక్షులకు శిక్షణనిస్తున్నారు. హైదరాబాద్‌, మహారాష్ట్ర నుంచి విభిన్నజాతులకు చెందిన పక్షి పిల్లలను కొనుగోలు చేసి ఇచ్చోడకు తీసుకొస్తారు. వాటికి సోను, మున్నా, చింటూ అని పిల్లల మాదిరిగా పలకరిస్తూ... 21 రోజులపాటు కొనసాగే శిక్షణ అంతా పక్షుల పాఠశాలను తలపిస్తుంది. ఇక్కడ శిక్షణ ఇచ్చిన లవ్‌బర్డ్స్‌కు అమితమైన డిమాండ్‌ ఉంది. మూడు రంగుల్లో ఉండే ఆస్ట్రేలియన్‌ చిలకలు, నెత్తిన జుట్టు ఉండే కాక్‌టెయిల్‌ పక్షులు, పావురాలు సహా భిన్న జాతులు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

పక్షులే కాదు..

కుందేళ్లు, తెల్ల ఎలుకలు, ఉడతలు, అక్వేరియంలో చేపల పెంపకం చూడముచ్చట కలిగిస్తాయి. పక్షుల కిలకిలరావాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటాయి. లవ్‌బర్డ్స్‌లో ఒకదాన్ని ఒకటి వదలకుండా కలిసి ఉండటం... తెల్ల ఎలుకలు, ఉడతలు చేసే సందడి అంతాఇంతా కాదు. వివిధ రకాల పక్షులు పెట్టే గుడ్లను పొదిగేస్తూ... వాటి సంతానోత్పత్తి చేస్తున్నారు. పంజరాల్లోనే గుడ్లు పెట్టి, పిల్లలను పొదగడానికి ప్రత్యేక కుండలను ఏర్పాటు చేశారు. ఈ అభిరుచినే జీవనోపాధిగా మార్చుకున్నారు. ఈ పక్షులను బహుమతులుగా ఇవ్వడానికి, ఇళ్లలో పెంచుకోవడం కోసం అమ్ముతున్నారు. చాలా మంది వీటిని కొనుగోలు చేసి బహుమతులుగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఫిబ్రవరి నుంచి పాఠశాలల పునః ప్రారంభం.. వారికి మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.