ETV Bharat / state

'ప్రధాని మోదీ గొప్పోడా.. సీఎం కేసీఆర్​ గొప్పోడా': బండి సంజయ్​ - nirmal news

Bandi Sanjay who criticized KCR: ప్రధాని మోదీ గొప్పోడా.. సీఎం కేసీఆర్​ గొప్పోడా.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామయాత్రలో ప్రశ్నించారు. ప్రధాని పేదలకు ఇళ్లు కట్టిస్తున్నారని.. సీఎం ఏమి చేశారని అడిగారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ప్రధాని గొప్పోడా.. ఒక్క ఉద్యోగం ఇవ్వని సీఎం కేసీఆర్​ గొప్పోడా అని బండి అన్నారు.

Bandi Sanjay who criticized KCR
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​
author img

By

Published : Dec 1, 2022, 3:49 PM IST

Updated : Dec 1, 2022, 3:55 PM IST

Bandi Sanjay who criticized KCR: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన రేషన్‌ బియ్యంపై కేసీఆర్‌ తన ఫోటో పెట్టుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపణలు చేశారు. రేషన్​ బియ్యానికి సైతం కేంద్రమే డబ్బులు చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వం కొనే ధాన్యానికి డబ్బులిచ్చేది కేంద్రమేనని.. సీఎం కేసీఆర్ కేవలం​ మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తున్నారని తెలిపారు. నిర్మల్​ జిల్లా కుభీర్​ మండలంలో 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్​ ప్రారంభించారు.

ప్రజలందరినీ సన్నబియ్యం పండించమన్న ముఖ్యమంత్రి తన ఫాంహౌస్​లో మాత్రం దొడ్డు బియ్యం పండిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తున్నారు.. మరి సీఎం కేసీఆర్​ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని కోరారు. ఇప్పుడు చెప్పండి మోదీ గొప్పోడా.. కేసీఆర్​ గొప్పోడా.. అని అడిగారు.

"తెలంగాణలో రైతులు పంటను పండించే పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్​ తన వద్ద 300 ఎకరాలను ఉంచుకొని కోటీశ్వరుడు అయ్యాడు. కానీ తెలంగాణ రైతు మాత్రం బికారిగా మిగిలిపోయాడు. అలా ఎట్లా అవుతున్నారో అని రైతులు ఒకసారి ఆలోచించాలి. రైతులకు అసలు ఎటువంటి సంక్షేమాలు కానీ, ఇళ్లు కానీ ఇవ్వడం లేదు. ఆఖరికి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది." - బండి సంజయ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ప్రధాని మోదీ గొప్పోడా.. సీఎం కేసీఆర్​ గొప్పోడా

ఇవీ చదవండి:

Last Updated : Dec 1, 2022, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.