ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ప్రయాణికుల ప్రాంగణం ముందు ఆదివాసీలు నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో నెంబర్ 3ని తిరిగి పునరుద్ధరించాలని తెలుగు రాష్ట్రాలు రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ తుడుందెబ్బ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివాసీలు కదిలి వచ్చారు. ప్రయాణికుల ప్రాంగణం ఎదుట గంటపాటు బైఠాయించి నిరసన తెలిపారు. బస్సులు కదలకుండా అడ్డుకున్నారు. ఆదివాసీల ఉద్యోగ, ఉపాధి మార్గానికి దన్నుగా ఉన్న జీవో నెంబర్ 3ని రద్దు చేయడం తగదని, ఆదివాసీలు మరింత వెనకబడిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ జీవో పునరుద్ధరించాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?