ఆదిలాబాద్ పట్టణం మహాలక్ష్మివాడలో ఇంట్లో నిల్వ ఉంచిన అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కాలనీలో శ్రీనివాస్ బెల్టుషాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యం బాటిళ్లలో నీరు కలుపుతున్నారనే పక్కా సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు సోదాలు నిర్వహించారు. టూటౌన్ ఎస్సై నాందేవ్ ఆధ్వర్యంలో నిందితుడి నుంచి రూ.50వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు.
ఇవీ చూడండి : కోదండరాం దీక్ష విరమింపజేసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్