ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ గిరిజనులకు పట్టాలు, సర్టిఫికెట్ల జారీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్దన్ ఆరోపించారు. ప్రతి దానికి ఆధారాలు అడుగుతూ సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ తీరు మార్చుకోకపోతే... జడ్పీ సమావేశంలో ఆమెను నిలదీస్తామని పేర్కొన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పి స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. జడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ వైస్ ఛైర్మన్ రాజన్న తదితరులు హాజరయ్యారు. గిరిజనులకు విరాసత్ విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొనగా స్పందించిన జడ్పీ ఛైర్మన్ కలెక్టర్ తీరును దుయ్యబట్టారు. అంతకుముందు ఆయా అంశాలపై చర్చించారు. మండల కేంద్రంలోని కార్యాలయాల్లో ప్రజా టాయిలెట్లు నిర్మించాలని తీర్మానించారు.
ఇవీ చూడండి: శరణార్థి శిబిరంలో మంటలు- 4వేల మంది ఆశ్రయం ప్రశ్నార్థకం