ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గిన్నెర పంచాయతీ పరిధిలోని బొప్పపూర్ గ్రామస్థులకు వర్షాకాలంలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామం నుంచి అర కిలోమీటరు దూరం నడిచి వెళ్లి పురాతన బావి నుంచి మంచినీరు తెచ్చుకుంటున్నారు. మిషన్ భగీరథ పథకం కింద గ్రామంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చినా.. నీళ్లు మాత్రం 15 రోజులకు ఒకసారి మాత్రమే వస్తున్నాయి. వచ్చిన నీళ్లు ఒక్కరోజుకు కూడా సరిపోవడం లేదని గ్రామానికి చెందిన మహిళలు వాపోతున్నారు. మొదట్లో 15 రోజులు గ్రామస్థులు విద్యుత్ మోటారుతో తాగునీరు సరఫరా చేసినా.. క్రమేణా ఆ మోటారు కాలిపోయి.. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటారు బాగు చేయించి.. లేదంటే.. ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకొని తాగునీటి కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.
భగీరథ నీళ్లొచ్చినా... బావి నీరే దిక్కయ్యాయి! - Adilabad News
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. మారుమూల ప్రాంతాల ప్రజలు ఇంకా బావి నీళ్లపైనే ఆధార పడుతున్నారు. కిలోమీటర్ల కొద్ది నడుచుకుంటూ వెళ్లి నెత్తిన బిందెలతో తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని బొప్పపూర్ గ్రామానికి 15 రోజులకోసారి మిషన్ భగీరథ నీళ్లు వస్తుండటం వల్ల తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గిన్నెర పంచాయతీ పరిధిలోని బొప్పపూర్ గ్రామస్థులకు వర్షాకాలంలోనూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. గ్రామం నుంచి అర కిలోమీటరు దూరం నడిచి వెళ్లి పురాతన బావి నుంచి మంచినీరు తెచ్చుకుంటున్నారు. మిషన్ భగీరథ పథకం కింద గ్రామంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చినా.. నీళ్లు మాత్రం 15 రోజులకు ఒకసారి మాత్రమే వస్తున్నాయి. వచ్చిన నీళ్లు ఒక్కరోజుకు కూడా సరిపోవడం లేదని గ్రామానికి చెందిన మహిళలు వాపోతున్నారు. మొదట్లో 15 రోజులు గ్రామస్థులు విద్యుత్ మోటారుతో తాగునీరు సరఫరా చేసినా.. క్రమేణా ఆ మోటారు కాలిపోయి.. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోటారు బాగు చేయించి.. లేదంటే.. ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లు వచ్చేలా చర్యలు తీసుకొని తాగునీటి కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: "నా సొరకాయలు పోయాయి సార్..!"