ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సర్వం సన్నద్ధం చేశామని జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు స్రీనింగ్ పరీక్షలు నిర్వహించే థర్మల్ యంత్రాలు, శానిటైజర్లు, మాస్కులను పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు అందజేసినట్లు వెల్లడించారు.
విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించిన తర్వాతే పరీక్షా కేంద్రంలోనికి పంపిస్తామని రవీందర్ రెడ్డి చెప్పారు. విద్యార్థులంతా మాస్కులు ధరించే పరీక్ష రాయాలని తెలిపారు. రెండు రోజులకు ఓ పరీక్ష ఉన్నందున ప్రతీ పరీక్ష తర్వాత గదులను రసాయన ద్రావణాలతో పిచికారీ చేయిస్తామన్నారు.