Adilabad Cotton Farmers Problems : ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో లారీ అసోసియేషన్ ధర్నా కారణంగా పత్తి కొనుగోళ్లు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. దీంతో ఎక్కడికక్కడే వందలాది పత్తి వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారుల జోక్యంతో అసోసియేషన్ ప్రతినిధులు వెనక్కి తగ్గారు. లారీ అసోసియేషన్ ధర్నా కారణంగా వాహనాలను నిలిపివేయగా, పరిశ్రమల్లో పేరుకుపోయిన పత్తి నిల్వలను తరలించేందుకు అవరోధం ఏర్పడింది. పత్తి బేళ్లను గోదాముల నుంచి తరలించనిదే కొత్తగా చేసే పత్తిని నిల్వ చేయడం కష్టంగా మారుతుందని వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు.
Adilabad Cotton Lorry Drivers Protest : ఉదయం నుంచి వివిధ ప్రాంతాల నుంచి మార్కెట యార్డుకు వచ్చిన పత్తి వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. గంటల తరబడిగా నీరిక్షించిన రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. రైతుల ఆందోళనతో మార్కెట్ యార్డులో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటు లారీ అసోసియేషన్, జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ అసోసియేషన్ నాయకులు పట్టువీడలేదు.
Cotton Farmers Problems Telangana 2023 : ప్రతికూల వాతావరణం.. పత్తి రైతులకు శాపం
"దేశవ్యాప్తంగా లారీ డ్రైవర్లు నిరసన చేపట్టారు. అందులో భాగంగానే పత్తి లారీల డ్రైవర్లు నిరసన చేస్తున్నారు. కలెక్టర్, అధికారులు చెప్పినా వినడం లేదు. వీళ్లు ధర్నా చేయడం వల్ల పత్తి ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నాం. డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు ఏంటో తీర్చాలని కోరుతాం." - అక్బర్, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు
సీసీఐ రంగంలోకి దిగిన సరే.. పత్తి రైతుకు దక్కని మద్దతు ధర..
దీంతో ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు పాలనాధికారి శ్యామలా దేవి నేతృత్వంలో రెండు అసోసియేషన్లతో చర్చలు జరిపారు. రైతులకు ఇబ్బంది తలెత్తే చర్యలు చేపడితే ఊరుకోబోమని స్పష్టం చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా అధికారులకు లేదా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేశారు. వారితో చర్చల అనంతరం ఎట్టకేలకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.
"ట్రేడర్లైనా, ప్రెస్సింగ్ ఓనర్లైనా, డ్రైవర్లైనా చెప్పేది ఒక్కటే రైతులకు ఇబ్బంది కలిగే వ్యవహారాలు చేస్తే జిల్లా యంత్రాంగం ఉపేక్షించేది లేదు. రైతులను ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడితే జిల్లా యంత్రాంగం ఎవరైతే దాని కారకులు వారిని కనుక్కోవాలని చెప్పాం. ఎవరికైనా సమస్యలు ఉంటే అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలి. జిల్లా స్థాయిలో ఉంటే దాని సంబంధిత అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా పరిష్కరిస్తారు. అందరికీ చెప్పేది ఒక్కటే రైతులకు ఇబ్బంది కలిగించే ఏ పనీ చేయకూడదు." - పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
cotton farmers: దళారుల దగా... విత్తన పత్తి రైతులు విలవిల
పెట్టుబడైనా వస్తుందనుకుంటే అదీ లేదు.. మరి రైతుల పరిస్థితేంటి..?