కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్ సమీపంలో సమతపై జరిగిన హత్యాచారం కేసులో నిందితుల తరఫున వాదించకూడదని ఆదిలాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ తీర్మానించింది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న నిందితులకు కోర్టు ఈ నెల 16 వరకు రిమాండ్ పొడగించింది. ఆదిలాబాద్‌లోనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుచేస్తూ... హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజీ ప్రియదర్శిణిని ప్రత్యేక న్యాయమూర్తిగా నియమించింది. ఈ క్రమంలో నిందితులకు సత్వర శిక్ష పడేట్లు చూడాలని బార్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!