కేరళ మాదిరిగా రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత డిమాండ్ చేశారు. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేసిన కేంద్రం.. పెట్రోల్ ధరలు పెంచుతూ సామాన్యులపై పెనుభారం మోపుతోందని ఆరోపించారు.
పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. అదనపు పాలనాధికారి సంధ్యారాణికి వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పల్లా... పాల్గొన్న మంత్రి, ఎంపీ