ETV Bharat / state

ఆవు కడుపులో 20 కిలోల ప్లాస్టిక్​... సర్జరీ చేసిన డాక్టర్​

20 kg of plastic in a cow's stomach: ఓ ఆవు కడుపులో గుట్టలా ప్లాస్టిక్‌ కవర్లు పేరుకుపోయాయి. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా 20 కిలోల ప్లాస్టిక్​ ఆవు కడుపులో చేరింది. అయితే ఆ ఆవుకు శస్త్ర చికిత్స చేసి... ​ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి మూగజీవిని బతికించారు.

20 kg of plastic in a cow's stomach
ఆవు కడుపులో 20 కిలోల ప్లాస్టిక్​... సర్జరీ చేసిన డాక్టర్​
author img

By

Published : Jan 19, 2022, 12:16 PM IST

20 kg of plastic in a cow's stomach: ప్లాస్టిక్‌(పాలిథిన్‌) కవర్లను విచ్చలవిడిగా వాడొద్దని, ఆహార వ్యర్థాలతో ఇష్టారాజ్యంగా వాటిని వీధుల్లోకి విసిరేయవద్దని ప్రభుత్వాలు ఎంతగా మొత్తుకుంటున్నా వినే వారెందరు? అలాంటి వారి నిర్లక్ష్యమే మూగజీవుల పాలిట ప్రాణాంతకం అవుతోంది. అందుకు సోదాహరణంగా నిలిచేదే తాజా సంఘటన..

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం అడెగామ(కె) గ్రామవాసి రైతు ఆశన్నకు చెందిన ఆవు 10 రోజులుగా కడుపు ఉబ్బరంతో సతమతమవుతోంది. ప్రైవేటు వైద్యుడిచే చికిత్స చేయించినా తగ్గలేదు. ఈ క్రమంలో రైతు ఇచ్చోడ పశువైద్యుడు గోవింద్‌నాయక్‌ను సంప్రదించారు. మంగళవారం ఉదయం ఆవును పరిశీలించిన ఆయన.. దాని కడుపులో గుట్టలా ప్లాస్టిక్‌ కవర్లు ఉన్నట్లు నిర్ధారించి శస్త్ర చికిత్స చేశారు. 20 కిలోలకు పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి మూగజీవిని బతికించారు.

ఇదీ చదవండి: Minister KTR: 'ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.