ETV Bharat / state

పదో తరగతి జవాబుపత్రాలు మాయం.. కొనసాగుతున్న గాలింపు.. ఇద్దరు ఉద్యోగులపై వేటు - ఇద్దరు తపాల అధికారులపై వేటు

10th Class Answer Sheets Lost in Adilabad Update : నిన్న ఆదిలాబాద్‌ జిల్లాలో కనిపించకుండా పోయిన... పదో తరగతి తెలుగు పరీక్ష సమాధాన పత్రాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జవాబు పత్రాల కట్ట ఇంకా దొరకాల్సి ఉండగా... ఈ అంశంపై అదనపు కలెక్టర్‌, డీఈవో, పోలీసులు, తపాలాశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన... ఇద్దరు తపాలా శాఖ ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

10th Class
10th Class
author img

By

Published : Apr 4, 2023, 10:35 PM IST

10th Class Answer Sheets Lost in Adilabad Update : ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులో కనిపించకుండా పోయిన... పదో తరగతి తెలుగు పరీక్ష సమాధాన పత్రాల కట్ట కోసం పోలీసులు గాలిస్తున్నారు. 11 జవాబు పత్రాల కట్టల్ని స్థానిక తపాలా కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మూల్యంకన కేంద్రానికి తీసుకెళ్తుండగా… ఒక కట్ట ఎక్కడో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఎంత వెతికినా దొరకకపోవడంతో... పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అదనపు కలెక్టర్‌ రిజ్వాన్ భాషా, డీఈఓ ప్రణీత సహా పోలీసులు.... తపాలా శాఖ అధికారులతో సమావేశమయ్యారు.

దొరకని జవాబు పత్రాల కట్ట ఆచూకీ : జవాబు పత్రాల కట్ట ఎక్కడ పడిపోయి ఉంటుందని ఆరా తీశారు. ఉట్నూరులోని ప్రధాన వీధుల్లో గాలించారు. జవాబు పత్రాల కట్ట ఇంకా దొరకలేదు. ఇంత జరిగినా... అధికారుల తీరు మారలేదు. మరోవైపు తపాలా శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే జవాబు పత్రాల కట్ట మాయమైందని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అయినా రెండో రోజు మంగళవారం కూడా జవాబు పత్రాల కట్టను ఆటోలోనే బస్టాండ్​ వరకు తరలించారు. అనంతరం అక్కడ నుంచి బస్సులో మంచిర్యాలకు జవాబు పత్రాలను తీసుకెళ్లారు. నిన్న ఘటన తర్వాత కూడా అధికారులు అలాగే వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది.

తపాలా శాఖలో ఇద్దరు సిబ్బందిపై చర్యలు : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడకుండా అధికారులు ఇప్పటికైనా జవాబు పత్రాలు తరలించడంలో నిర్లక్ష్యం వహించకుండా.. ప్రత్యేక చొరవ తీసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటు.. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు తపాలా శాఖ ఉద్యోగులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఎంటీఎస్ రజిత, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి నాగరాజుపై వేటు వేశారు.

మరోవైపు తెలంగాణలో టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. ప్రకంపనలు రేపుతుండగానే, పదో తరగతి పేపర్లు బయటికి వస్తున్న ఘటనలు... కలకలం రేపుతున్నాయి. తొలిరోజు తెలుగు పరీక్ష ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే... వాట్సప్‌లో ప్రశ్నప్రతం ప్రత్యక్షం కాగా, రెండో రోజు హిందీ కూడా అదే తరహాలో బయటకు రావటం.... ఆందోళనకు గురిచేసింది.

వరంగల్‌ జిల్లాలో పేపర్‌ బయటికి వచ్చిందనే కథనాలు రావడంతో... విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులతో ఆరా తీశారు. మంత్రి సూచన మేరకు వరంగల్‌, హనుమకొండ డీఈవోలు వరంగల్‌ సీపీకి ఫిర్యాదు చేశారు. కాపీయింగ్‌లో భాగంగానే ప్రశ్నాపత్రం బయటకు వచ్చిందని... ఇది ముమ్మాటికీ లీక్‌ కాదని వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.