ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో ఉపాధిహామీ పనుల్లో అవినీతికి పాల్పడుతున్న సిబ్బంది వ్యవహారమొకటి బహిర్గతమైంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఒకరిద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు ఉపాధిహామీ కూలీల దగ్గర వారానికి ఒకరి దగ్గర రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్న విషయం అధికారుల దృష్టికి వచ్చింది.
పనిచేయించకుండా చేసినట్లు చూపించే ప్రయత్నంలో భాగంగానే కూలీల దగ్గర డబ్బులు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చూడండి : పోతిరెడ్డిపాడుపై కేంద్రమంత్రికి ఉత్తమ్ ఫోన్