టోక్యో ఒలింపిక్స్లో తొలి గోల్ట్ మెడల్ చైనానే వరించింది. షూటింగ్.. మహిళల 10.మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో చైనా క్రీడాకారిణి యాంగ్ క్యాన్ బంగారు పతకం సాధించింది.
శనివారం(జులై 24) జరిగిన ఫైనల్లో 251.8 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టించింది. రష్యా ఒలింపిక్ కమిటీ(ఆర్ఓసీ) షూటర్ 251.1 పాయింట్లతో రజతానికి పరిమితమైంది. స్విట్జర్లాండ్ క్రీడాకారిణికి కాంస్యం దక్కింది.

మన షూటర్లు విఫలం..
అంతకుముందు క్వాలిఫికేషన్ రౌండ్లో మన షూటర్లు పూర్తిగా నిరాశపర్చారు. ఎలవెనిల్ వలరివన్(16), అపూర్వి చండేలా(36) స్థానాల్లో నిలిచారు. టాప్-8 వారికే ఫైనల్ రౌండ్ చోటు దక్కింది.