ETV Bharat / sports

ఒలింపిక్స్​ నుంచి ఓటమితో వైదొలిగిన ఒసాకా - ఒలింపిక్స్​ నుంచి నవోమి ఒసాకా ఔట్

సొంతగడ్డపై జరుగుతోన్న టోక్యో ఒలింపిక్స్​లో స్టార్​ టెన్నిస్ ప్లేయర్​ నవోమి ఒసాకా ఆకట్టుకోలేకపోయింది. విశ్వక్రీడల​ నుంచి ఓటమితో వైదొలిగింది. చెక్​ క్రీడాకారిణి మార్కెటాపై 1-6, 4-6తో పరాజయం పాలైంది ఈ జపాన్​ ప్లేయర్​.

Naomi Osaka, Tokyo Olympics
నవోమి ఒసాకా, టోక్యో ఒలింపిక్స్
author img

By

Published : Jul 27, 2021, 12:42 PM IST

ప్రపంచ రెండో సీడ్​ ప్లేయర్​ నవోమి ఒసాకా ఒలింపిక్స్​ నుంచి ఓటమితో వైదొలిగింది. మహిళల సింగిల్స్​లో చెక్​ రిపబ్లిక్​ క్రీడాకారిణి మార్కెటా వండ్రౌసోవా 6-1, 6-4 తేడాతో విజయం సాధించింది.

తొలి సెట్​లో కేవలం ఒకే ఒకే గేమ్​ను గెలుచుకున్న ఒసాకా.. రెండో సెట్​లో కాస్త ప్రతిఘటించింది. ప్రపంచ స్టార్ ప్లేయర్​ అయిన నవోమి.. వరుస సెట్లలో ఓడిపోవడం ఆశ్చర్యపడాల్సిన విషయమే.

వింబుల్డన్​ ఓపెన్​ 2021 ఛాంపియన్​ యాష్లే బార్టీ కూడా టోక్యో ఒలింపిక్స్​ నుంచి ఓటమితో తప్పుకుంది. ఆదివారం స్పెయిన్​ క్రీడాకారిణి సోరిబెస్​ టోర్మోతో జరిగిన మ్యాచ్​లో 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో మ్యాచ్​ను కోల్పోయింది.

ఇదీ చదవండి: Tokyo Olympics: బాక్సింగ్​లో జోరు​..​ క్వార్టర్స్​లో లవ్లీనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.