ETV Bharat / sports

'ఫలితం ఎలా ఉన్నా.. ఆట సంతృప్తినిచ్చింది' - మా లాంగ్​

భారత స్టార్​ టేబుల్​ టెన్నిస్​ ఆటగాడు శరత్​ కమల్​.. ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒలింపిక్స్​ మూడో రౌండ్​లో డిఫెండింగ్​ ఛాంపియన్​ మా లాంగ్​తో జరిగిన పోరుపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Sharath Kamal
శరత్​ కమల్​
author img

By

Published : Jul 29, 2021, 3:44 PM IST

ఒలింపిక్స్​ వేదికగా డిఫెండింగ్​ ఛాంపియన్, చైనా ఆటగాడు​ మా లాంగ్​తో జరిగిన మ్యాచ్​ను తన కెరీర్​లోనే ఉత్తమమైన పోరుగా అభివర్ణించారు భారత టెబుల్​ టెన్నిస్ స్టార్​​ ఆచంట శరత్​ కమల్. జులై 27న జరిగిన ఈ పోరులో 11-7, 8-11, 13-11, 11-4, 11-4 తేడాతో శరత్​​ ఓడినప్పటికీ.. తన పోరాట పటిమతో హృదయాలను గెలుచుకున్నారు. తాజాగా ఒలింపిక్స్​పై 'ఈటీవీ భారత్​'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు శరత్​ కమల్​.

ప్రశ్న: లాంగ్​ను మీరు ఒత్తిడిలోకి నెట్టగలిగారు. విజయావకాశాలు మీకు ఎక్కువగా కనపించాయి. మ్యాచ్​ ప్రారంభానికి ముందు ఎలా సన్నద్ధమయ్యారు?

క్లిష్టమైన డ్రా రావడం వల్ల టోర్నీ కఠినంగా ఉంటుందని ముందే అర్థమైంది. రౌండ్​ 2లో అపొలొనియాతో పోరు జరిగింది. అతనిని నేను 15ఏళ్లల్లో ఒక్కసారి కూడా ఓడించలేదు. ఇక ఆ తర్వాతి మ్యాచ్​ డిఫెండింగ్​ ఛాంపియన్​ మా లాంగ్​తో జరిగింది. గెలిచే అవకాశం 50/50 అని మ్యాచ్​కు ముందే అర్థమైంది. కానీ ప్రత్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. నేను గెలవడం కోసమే వచ్చానని అవతలి వ్యక్తికి తెలిసేలా చేద్దాం అనుకున్నా. నన్ను ఓడించాలంటే, నాకన్నా మెరుగ్గా ఆడాల్సి ఉంటుందని అర్థమయ్యేలా చేశాను. అదే ఉద్దేశంతో మ్యాచ్​లోకి వెళ్లా. మూడో రౌండ్​ గెలిచి ఉంటే, ఆ తర్వాత మ్యాచ్​ సొంతమయ్యేది. కానీ గెలవలేకపోయాను. లాంగ్​పై ఒత్తిడి తీసుకురాగలిగాను. ముప్పుతిప్పులు పెట్టాను. కానీ పూర్తి పట్టుసాధించలేకపోయాను. ఏదేమైనా.. లాంగ్​ను ఒత్తిడిలోకి నెట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ప్రశ్న: చివరి రెండు సెట్లలో ఏం జరిగింది? మ్యాచ్​.. అప్పటివరకు ఒక విధంగా.. ఆ తర్వత ఇంకో విధంగా సాగింది. ఎందుకిలా?

అవును.. చివరి రెండు సెట్లను పరిశీలిస్తే అంతే. అప్పుడు స్కోర్​బోర్డును చూస్తే, లాంగ్​ నాపై పూర్తి ఆధిపత్యం చేలాయించారని అందరూ అనుకుంటారు. మ్యాచ్​ని పూర్తిగా చూసినవారికే దాని తీవ్రత అర్థమవుతుంది. నాలుగు, ఐదు రౌండ్లలో లాంగ్​ బాగా ఆడారు. తనపై ఒత్తిడిని తగ్గించుకుని, మంచి షాట్లు కొట్టారు. ఆ సమయంలో అతికష్టం మీద నేను నాలుగు పాయింట్లు సాధించా. నేను ఆడిన మ్యాచ్​లో ఇది అత్యంత ఉత్తమమైనది.

Sharath Kamal
శరత్​ కమల్​

ప్రశ్న: మరి మిక్స్​డ్​ డబుల్స్​ సంగతేంటి?

మిక్స్​డ్ డబుల్స్​లో పతకం సాధిస్తామనుకున్నా. అది జరగకపోతే కనీసం క్వార్టర్స్​పై గురిపెట్టాము. డ్రా పరంగా అటు మిక్స్​డ్ డబుల్స్​, వ్యక్తిగతంగా దురదృష్టం వెంటాడిందని నా అభిప్రాయం. వేరే జోడీ వచ్చుంటే మా ఆట మేము ఆడుకోగలిగేవాళ్లం.

ప్రశ్న: వచ్చే ఒలింపిక్స్​పై మీ నిర్ణయం?

ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కానీ వచ్చే ఒలింపిక్స్​లో ఆడే విషయాన్ని కొట్టిపారేయడం లేదు. ప్రస్తుతం ఏడాది తర్వాత జరిగే కామన్​వెల్త్​, ఆసియన్​ పోటీలపై దృష్టిపెట్టా. ఆ తర్వాత వచ్చే ఒలింపిక్స్​ గురించి ఆలోచిస్తా.

ఇదీ చూడండి:- India at Olympics: ఆరో రోజు అదుర్స్​.. ఆశలన్నీ వీరిపైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.