ETV Bharat / sports

Olympics 2020: అబ్బాయిలు సాధించారు.. మరి అమ్మాయిలు? - Nirma Noah Tom

టోక్యో ఒలింపిక్స్​ 14వ రోజుకు చేరుకుంది. శుక్రవారం(ఆగస్టు 6) జరిగే పోటీల్లో కొంతమంది భారత అథ్లెట్లు పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. వారు పతకాలు సాధిస్తారని యావత్​ దేశం ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. మరి వారెవరో చూద్దాం..

hockey
హాకీ
author img

By

Published : Aug 5, 2021, 11:03 PM IST

టోక్యో ఒలింపిక్స్​ మరో మూడు రోజుల్లో ముగియనుంది. ఈ విశ్వక్రీడల్లో గురువారం(ఆగస్టు 5) అందుకున్న రెండు పతకాలతో కలిపి ఇప్పటివరకు ఐదు మెడల్స్​ సాధించింది భారత్​. ఇందులో రెండు రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. అయితే శుక్రవారం(ఆగస్టు 6, 14వ రోజు) జరిగే పోటీల్లో మరింత మంచి ప్రదర్శన చేసి పతకాల సంఖ్యను పెంచుకోవాలని పట్టుదలతో ఉంది.

కాంస్యం సాధిస్తారా?

ఒలింపిక్స్​లో సెమీస్​లో ఓడి చరిత్ర సృష్టించే అవకాశాన్ని పోగొట్టుకున్నా.. తమ వీరోచిత పోరాటంతో యావత్​ దేశప్రజల మనసును దోచుకున్నాయి భారత పురుషుల, మహిళల హాకీ జట్లు. అయితే దేశానికి పతకం అందించాలన్న పట్టుదలతో కాంస్య పోరుకు సిద్ధమయ్యాయి. అనుకున్నట్లే.. పురుషుల జట్టు గురువారం జరిగిన మ్యాచ్​లో జర్మనీపై అద్భుత ప్రదర్శన చేసి కాంస్యం సాధించింది. 41ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత హాకీకి ఇదే తొలి పతకం. అలాగే మహిళల జట్టు కూడా శుక్రవారం జరిగే పోరులో గ్రేట్​ బ్రిటన్​ను ఎదుర్కొని సత్తా చాటాలని కసిగా ఉంది. కాగా, దేశానికి మహిళల హాకీలో తొలి ఒలింపిక్స్​ పతకం అందించడానికి ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేసింది కెప్టెన్​ రాణిరాంపాల్​. మరి ఈ ఉత్కంఠ పోరులో మన మహిళలు పతకాన్ని సాధించి దేశ ప్రజల అంచనాలను అందుకుంటారో లేదో చూడాలి.

hockey
హాకీ
hockey
హాకీ

మరోవైపు రెజ్లింగ్​లో భజరంగ్​ పునియాపై కూడా భారీ ఆశలే ఉన్నాయి. అతడు పతకం సాధిస్తాడని క్రీడాభిమానులు నమ్మకం పెట్టుకున్నారు.

bhajarang punia
భజరంగ్​ పునియా

ఆగస్టు 6న జరిగే క్రీడా వివరాలు ఇవే..

అథ్లెటిక్స్​- అర్ధరాత్రి 2 గంటల నుంచి

పురుషుల 50 కి.మీ. రేస్​ వాక్​ ఫైనల్​-- గురుప్రీత్​ సింగ్​

గోల్ఫ్​- మహిళల రౌండ్​-3(5.29 నుంచి)

అదితి అశోక్​, దీక్ష దగర్​

హాకీ- (ఉదయం 7గంటలకు)

కాంస్య పతక పోరు: టీమ్​ఇండియా X గ్రేట్​ బ్రిటన్

రెజ్లింగ్​

పురుషుల ఫ్రీ స్టైల్​ 65 కిలోలు: భజరంగ్​ పునియాxఎర్నాజర్​- ఉదయం 8 గంటలకు

మహిళల ఫ్రీస్ట్లై 50కిలోలు: సీమ బిస్లాxసర్ర హమ్ది(తునిషియా)- ఉదయం 8 గంటలకు

అథ్లెటిక్స్​..

20 కిలోమీటర్ల రేస్​ వాక్ ఫైనల్​​: ప్రియాంక గోస్వామి, భావ్నా జత్- మధ్యాహ్నం ఒంటి గంటకు.​

4x400 మీటర్ల రిలే రౌండ్​ 1 హీట్ 2: సాయంత్రం 5.07 గంటలకు ​

ఇదీ చూడండి: Hockey India: హాకీ జట్టుకు కాంస్యం- తెర వెనుక ఆ 'సీఎం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.