ETV Bharat / sports

Olympics: ఫైనల్​ బెర్త్​పై హాకీ పురుషుల జట్టు గురి - ఒలింపిక్స్​ 11వ భారత్​ షెడ్యూల్​

ఒలింపిక్స్​లో 11వ రోజు భారత్.. పలు క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇందులో పురుషుల హాకీ మ్యాచ్​తో పాటు జావెలిన్ త్రో పోటీలు ఉన్నాయి.

hockey
హాకీ
author img

By

Published : Aug 2, 2021, 8:17 PM IST

టోక్యో ఒలింపిక్స్​ మరో ఆరు రోజుల్లో పూర్తికానున్నాయి. కానీ ఇప్పటివరకు భారత్​ కేవలం రెండు పతకాలే నెగ్గింది. వెయిట్​ లిఫ్టింగ్​లో మీరాబాయి చాను తొలి పతకం(రజతం) సాధించగా.. షట్లర్​ పీవీ సింధు కాంస్యం నెగ్గింది. ఇప్పుడు టోర్నీ 11వ రోజుకు చేరుకుంది. మంగళవారం(ఆగస్టు 3) మరికొందరు భారత అథ్లెట్లు పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరి ప్రదర్శనతోనైనా భారత్​కు పతకాల సంఖ్య పెరుగుతుందేమో చూడాలి.

హాకీపై భారీ ఆశలు

ఈ విశ్వక్రీడల్లో మంగళవారం జరగబోయే పోటీల్లో భారత హాకీ పురుషుల జట్టు ఆడబోయే సెమీస్​ కోసం యావత్​ దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో బ్రిటన్‌పై 3-1 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించిన మన జట్టు​.. 41ఏళ్ల తర్వాత తొలిసారి ఒలింపిక్స్​ సెమీస్​ ఆడనుంది. ఈ మ్యాచ్​లో నెగ్గితే ఫైనల్​కు చేరి రికార్డు సాధించినట్లవుతుంది. చివరిసారిగా 1980లో పురుషుల హాకీ జట్టు​ స్వర్ణం దక్కించుకుంది.

టోక్యో ఒలింపిక్స్​ 11వ రోజున(ఆగస్టు 3) భారత్ పోటీలు

హాకీ

భారతకాలమానం ప్రకారం ఉదయం 7గంటలకు సెమీఫైనల్​లో భారత జట్టు బెల్జియంతో తలపడనుంది

జావెలిన్​ త్రో

మహిళల జావెలిన్​ త్రో క్వాలిఫికేషన్​ గ్రూప్​ ఏలో అథ్లెట్​ అన్ను రాణి పాల్గొననుంది. ఉదయం 5.50 ఈ పోటీ ప్రారంభం కానుంది.

షాట్​ఫుట్

ఉదయం 3.45 గంటలకు పురుషుల షాట్​ఫుట్​ క్వాలిఫికేషన్​ గ్రూప్​ ఏలో తాజిన్​దర్పల్​ సింగ్ బరిలో దిగనున్నాడు.

రెజ్లింగ్​

మహిళల 62 కేజీల విభాగంలో ​సోనమ్​ మాలిక్​ మంగోలియాకు చెందిన బొలొర్​తుయా ఖురెఖ్కును ఎదుర్కోనుంది. ఈ బౌట్​ ఉదయం 8.30గంటల తర్వాత ప్రారంభమవుతుంది. ఈ బౌట్​లో క్వాలిఫై అయితే క్వార్టర్​ ఫైనల్​కు వెళ్తుంది. అక్కడ కూడా నెగ్గితే సెమీ ఫైనల్​కు అర్హత సాధిస్తుంది.

ఇదీ చూడండి: 49 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్​ సెమీస్​లో భారత హాకీ జట్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.