ETV Bharat / sports

రెజ్లింగ్​లో చేజారిన స్వర్ణం.. సుశీల్​ కన్నీటి పర్యంతం - రవి దహియా ఓటమి

రెండుసార్లు ఒలింపిక్​ విజేత​ సుశీల్​ కుమార్​ భావోద్వేగానికి గురయ్యాడు. టోక్యో ఒలింపిక్స్​లో 57 కిలోల విభాగంలో భారత రెజ్లర్​ రవి దహియా ఓటమి పాలయ్యాడు. దీంతో తిహార్​ జైల్లో ఉన్న సుశీల్​ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ విషయాన్ని జైలు అధికారులు వెల్లడించారు.

sushil kumar, ravi dahiya
సుశీల్ కుమార్, రవి దహియా
author img

By

Published : Aug 6, 2021, 7:20 PM IST

ఆడుతున్న తొలి ఒలింపిక్స్​లోనే రజతంతో మెరిశాడు భారత రెజ్లర్​ రవి దహియా. గొప్పగా పోరాడినప్పటికీ 57 కేజీల ఫ్రీస్టైల్​ ఫైనల్లో గెలవలేకపోయాడు. దీంతో అఖండ భారతావని బాధపడింది. ఈ ఓటమిపై భారత స్టార్​ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్​ పతక విజేత​ సుశీల్​ కుమార్ స్పందించాడు.

రష్యా ఒలింపిక్ కమిటీ(ఆర్​ఓసీ) రెజ్లర్​ జవుర్​ యుగెవ్​తో జరిగిన ఫైనల్​ను టీవీలో చూశాడు సుశీల్. మ్యాచ్​లో రవి దహియా ఓడిపోవడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. రెజ్లింగ్​లో భారత్​కు తొలి స్వర్ణం వస్తుందని ఆశించాడు. ఈ విషయాన్ని తిహార్​ జైలు అధికారులు వెల్లడించారు.

మల్లయోధుడు సాగర్​ ధంకర్​ హత్యకేసులో భాగంగా తిహర్​ జైలులో శిక్షను అనుభవిస్తున్నాడు సుశీల్​. మే 4న దిల్లీలోని ఛత్రసాల్​ స్టేడియం వద్ద ఈ హత్య జరిగింది. విశ్వక్రీడల్లో భారత్​ తరఫున రెండు పతకాలు సాధించిన ఏకైక రెజ్లర్​ సుశీల్​. 2008 బీజింగ్ ఒలింపిక్స్​లో కాంస్య పతకం గెలుపొందిన సుశీల్​, 2012 లండన్​ గేమ్స్​లో వెండితో మెరిశాడు.

ఇదీ చదవండి:

రెజ్లర్​ సుశీల్​పై దిల్లీ పోలీసుల ఛార్జిషీట్​

జైలులో సుశీల్​ 'వీఐపీ' డిమాండ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.