టోక్యో పారాఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా భారత్ దూసుకుపోతోంది. ఈ క్రమంలో సోమవారం భారత్‌కు పతకాల పంట పండింది. పారాఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి ఓ భారత మహిళా షూటర్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఎయిర్ రైఫిల్ విభాగంలో(Paralympic Shooting) అవని లేఖారా స్వర్ణ పతకంతో(Avani Gold Medal) సత్తా చాటింది. 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో సత్తా చాటిన అవని.. పారాఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
డిస్కస్ త్రోలో రజతం
అటు డిస్కస్ త్రోలోనూ భారత్ మరో పతకాన్ని కైవసం చేసుకుంది. డిస్కస్‌త్రో లో భారత అథ్లెట్ యోగేశ్ కతునియా(Yogesh Kathuniya).. రజతంతో సత్తా చాటాడు. క్లాస్ F 56 విభాగంలో మెరుగైన ప్రదర్శన చేసిన యోగేశ్.. భారత్‌కు రజతాన్ని అందించాడు. డిస్కస్ త్రోను 44.38 మీటర్లు విసిరి పతకాన్ని దక్కించుకున్నాడు. పతకం సాధించటం ఎంతో సంతోషంగా ఉందన్న యోగేశ్.. తనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన భారత పారాఒలింపిక్స్ కమిటీకి(Indian Olympic Association) కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తన తల్లి అందించిన ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు యోగేశ్ తెలిపారు.
జావెలిన్ త్రోలోనూ..
జావెలిన్ త్రో లోనూ భారత్ తనదైన ముద్ర వేసింది. ఈ విభాగంలో ఏకంగా రజతం, కాంస్య పతకాలను భారత అథ్లెట్లు కైవసం చేసుకున్నారు. F46 విభాగంలో 64.35 మీటర్ల దూరం విసిరి దేవేంద్ర ఝజారియా(Devendra Javelin Throw) రజతాన్ని.. కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో సుందర్ సింగ్.. 64.01 దూరం విసిరి కాంస్య పతకాన్ని(Sundar Singh Gurjar Bronze) దక్కించుకున్నాడు. టోక్యో పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్‌కు 7 పతకాలు దక్కగా అందులో స్వర్ణం సహా 4 రజతాలు, రెండు కాంస్య పతకాలున్నాయి.
ఇదీ చూడండి.. Tokyo Paralympics: జావెలిన్ త్రోలో భారత్‌కు రెండు పతకాలు