టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న స్టార్ షట్లర్ పీవీ సింధు.. రానున్న జనరేషన్‌కు ఈ మెడల్స్ స్పూర్తిగా నిలుస్తాయని చెప్పింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి బింగ్జియావోపై 21-13, 21-15పై గెలిచిన ఆమె.. వరుసగా రెండోసారి ఒలింపిక్స్ పతకం దక్కించుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో ఆమె రజతం దక్కించుకుంది. ఈ క్రమంలోనే వరుసగా రెండు పతకాలు సొంతం చేసుకున్న భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది.

"చాలామంది యువతీయువకులు.. ఈ పతకాల్ని చూసి స్పూర్తి పొందుతారు. ఒలింపిక్స్‌లో పాల్గొనేలా కష్టపడాతారు. చేయగలను, సాధించగలను అనుకుంటే ఎవరైనా గెలవగలరు" అని సింధు చెప్పింది. గత ఒలింపిక్స్ కంటే మెరుగైన పతకం సాధించనందుకు బాధపడుతున్నట్లు ఆమె తెలిపింది.
"ఈ ఒక్క మ్యాచ్ కోసం నా భావోద్వేగాల్ని నియంత్రించుకుని ఆడాను. పతకం సాధించినందుకు ఆనందంగా ఉంది. దేశం కోసం మెడల్ సాధించడం నాకే కాదు అందరికీ గర్వంగా ఉంటుంది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా బంగారం గెలుచుకునేలా కష్టపడతాను" అని సింధు చెప్పింది.

ఇవీ చదవండి: